సద్దుల సంబరం.. ఒకే రంగు చీరల్లో మెరిసిన మహిళామణులు….. పోచారం ఎల్‌ఐజీ టౌన్‌షిప్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు

ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజా వాణి) : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ సంబరాలు పోచారం డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ టౌన్‌షిప్‌లో అత్యంత వైభవంగా, కనులవిందుగా జరిగాయి. ఎల్‌ఐజీ టౌన్‌షిప్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నిర్వహించిన ఈ వేడుకలు కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో మహిళలంతా ఒకే రంగు సంప్రదాయ చీరలు ధరించి పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒకే వర్ణంలో మెరిసిపోతూ మహిళామణులంతా ఒక్కచోట చేరిన దృశ్యం పండుగ శోభను రెట్టింపు చేసింది. రంగురంగుల పూలతో...