prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:01 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

సత్య అహింస సత్యాగ్రహాల మార్గ ప్రదాత మహాత్మునికి ఘన నివాళులు

సత్య అహింస సత్యాగ్రహాల మార్గ ప్రదాత మహాత్మునికి ఘన నివాళులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

సత్యం, అహింస, సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యం చేసి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి, మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నైతిక శక్తిని అందించిన మహానేతగా మహాత్ముడు జయంతి ఉత్సవాలలో ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కీర్తించారు. జయంతి ఉత్సవాలలో ముందుగా నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్ముని స్ఫూర్తితో శాంతి, అహింస, సత్యాగ్రహ మార్గాలలో సర్వోదయ, అంత్యోదయ, గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత లక్ష్యాలుగా ముందుకు సాగాలని కోరారు. ప్రపంచ స్థాయిల నేపథ్యంలో గాంధీ మార్గం, అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, డా. ప్రేమ్సాగర్, డా వై శ్రీనివాస్ రెడ్డి, రమేష్ నాయక్, ఎస్ ఓ డా బేగ్ వంటి అధ్యాపకులు ఉన్నారు.