సంస్కృతీ సంప్రదాయాల కాంతి.. సిద్ధార్థలో ముందస్తు బతుకమ్మ సంబరాలు!
సంస్కృతీ సంప్రదాయాల కాంతి.. సిద్ధార్థలో ముందస్తు బతుకమ్మ సంబరాలు! ఆకట్టుకున్న కన్నులపండువ వేడుకలు ఆటపాటలతో హోరెత్తించిన పాఠశాల ప్రాంగణం భావితరాలకు సంస్కృతిని అందించాలి: కంది గోపాల్ రెడ్డి, వీరమల్ల మాధవరెడ్డి చెన్నారావుపేట అక్టోబర్ 08 ప్రజావాణి రంగురంగుల పూల ఘుమఘుమలు.. చిన్నారుల చేతి గాజుల సవ్వడులు.. లయబద్ధమైన కోలాటాల నడుమ దసరా నవరాత్రులను పురస్కరించుకుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్లో గురువారం ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకైన ఈ పండుగను పాఠశాల ప్రాంగణంలో...