సంతోషిమాత ఆలయ ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలి – బిజెపి నేత మామిడిపల్లి ప్రసాద్

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత దేవాలయంలో పూజారిపై దాడి చేసి, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు ఎండి అన్సారిని కఠినంగా శిక్షించాలని జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు మామిడిపల్లి ప్రసాద్ డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై మతోన్మాద శక్తులు దాడులు చేస్తుంటే, మతిస్థిమితం లేదనే వంకతో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కాపాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.