*శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన చదువుల తల్లి దుర్గమ్మ*
*నేరేడుచర్ల/ప్రజావాణి , అక్టోబర్ 16:*
నేరేడుచర్ల పురపాలక పరిధిలో రామపురంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దుర్గ మాత మండపం వద్ద జ్ఞాన సరస్వతి చదువుల తల్లి మూలా నక్షత్రం అమ్మవారి ఇష్టమైన నక్షత్రంగా అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి బాల బాలికలకు అక్షరాభ్యాసాలు చేయించి మంచి విద్య బుద్ధులు కలగాలని చిన్నారుల తోటి సరస్వతి పూజ పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మహిళలు కుంకుమ పూజ అష్టోత్తర శతనామాలు లలిత సహస్రనామాలు సాయంకాలం పూజ నక్షత్ర హారతి, త్రిశూల హారతులు భవానీ మాలలు ధరించిన భక్తులు భవాని యూత్ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.