prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:25 pm Digital Edition : PRAJA VANI

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ కొమ్ము నరసింహారావుకు ఘన సన్మానం

*శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ కొమ్ము నరసింహారావుకు ఘన సన్మానం*

ముదిగొండ అక్టోబర్ 1 ప్రజావాణి ప్రతినిధి

ముదిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌‌గా నియమితులైన కొమ్ము నరసింహారావును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చి రామయ్య స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, కొమ్ము నరసింహారావు నియామకానికి సహకరించి ఆమోదం తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జోన్ ఇంచార్జి మల్లెల అజయ్, ఐ యన్ టీయుసీ అధ్యక్షులు ఉసికల రమేష్, రాఘవాపురం గ్రామ శాఖ అధ్యక్షులు వీర్ల సుధాకర్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు నాయిని సునీత వెంకటేశ్వర్లు, ముదిగొండ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఇరుకు కొరివి, నాయకులు మల్లెల ఉపేందర్ రావు, బూరుగు శ్రీను, బలంతు వెంకట్, అంతోటి నాగరాజు, వేల్పుల హరికృష్ణ, కందుల పుల్లయ్య, రాఘవ, ముదిగొండ సోషల్ మీడియా కన్వీనర్ మాణిక్యం అఖిల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.