శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి
*శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి* చిలిపిచేడు, అక్టోబర్ 24 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి చిలిపిచెడ్ మండలంలోని శ్రీ చాముందేశ్వరి దేవాలయాన్ని గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సీనియర్ నాయకులు దశరథ్, సంతోష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.