శ్రీరామగిరిలో బతుకమ్మ శిలా పలకం ధ్వంసం..
పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచి ప్రశాంత్
ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని శ్రీ రామగిరి లో ఇటీవల ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహ శిలా కలకాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచి మాదరి ప్రశాంత్ గురువారం నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ ఈనెల 17న,ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహానికి చెందిన శిలాఫలకాన్ని ఈనెల 20 తేదీ రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల తో పగలగొట్టారన్నారు. దీంతో శిలాఫలకానికి పగుళ్లు వచ్చాయని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతకానికి వడిగట్టారని సమగ్ర విచారణ చేపట్టి వారిని గుర్తించి పట్టుకొని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.