శ్రమదానంతో వీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం సర్పంచ్ దుర్గా నర్సింగరావు
*శ్రమదానంతో వీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం* *గ్రామ యువత వారానికి ఒక్కసారైనా శ్రమదానంలో పాల్గొనాలి: సర్పంచ్ దుర్గా నర్సింగరావు గుమ్మడిదల: గ్రామ అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ, తమ వంతు బాధ్యతగా శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని వీరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దుర్గా నర్సింగరావు పిలుపునిచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ఆదివారం గ్రామంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుర్గా నర్సింగరావు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి అనేది కేవలం ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత మాత్రమే...