శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు :
శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 15: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, IAS ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Cఎంసీ (CMC) అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగం మరియు అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
ఈ సంబరాలలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, IAS గారితో పాటు యూసీడీ, యూబీడీ విభాగాల అధికారులు, మహిళా ఉద్యోగులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అమర్చి, సాంప్రదాయ బతుకమ్మ పాటలతో జోనల్ కార్యాలయ ప్రాంగణంలో కోలాహలం సృష్టించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.