prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 8:51 am Digital Edition : PRAJA VANI

శివన్న గూడెం రిజర్వాయర్ పూర్తి చేసి మునుగోడులో ఫ్లోరైడ్ తరిమికొడదాం

*శివన్న గూడెం రిజర్వాయర్ పూర్తి చేసి మునుగోడులో ఫ్లోరైడ్ తరిమికొడదాం*

*రాచకొండ దసరా వేదికగా శివన్న గూడెం రిజర్వాయర్ డిమాండ్*

*రిజర్వాయర్ పూర్తి అయితేనే రైతుకు, ప్రజలకు నీరు – దసరా ఉత్సవ సమితి డిమాండ్*

*రాచకొండ దసరా ఉత్సవ సమితి & ఇఎల్వీ ఫౌండేషన్ భాస్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు -2026*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

రాచకొండ దసరా ఉత్సవ సమితి & ఇఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు – 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు, ఆటపాటలు, బాణాసంచా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డిమాండ్ చేశారు. “శివన్న గూడెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేయాలి”. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, ఇఎల్వీ ఫౌండేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.