prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 6:24 pm Digital Edition : PRAJA VANI

శంకరంపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో విషాదం – 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్య

*శంకరంపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో విషాదం – 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్య!*

*కుటుంబ కలహాలు, మద్యం వ్యసనమే కారణమా? – మనస్తాపంతో యువకుడు బలవన్మరణం!*

*తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు – జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి!*

*శంకరంపేట లో విషాద ఘటన – యువకుడి ఆత్మహత్యతో కుటుంబంలో విషాద ఛాయలు*

పెద్ద శంకరంపేట ప్రజావాణి న్యూస్

మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్ర శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం ఆ కాలనీలో విషాదాన్ని నింపింది.

మృతుడు నీలకంఠ దుర్గ ప్రసాద్, వయస్సు 32 సంవత్సరాలు,ఇతను శంకరంపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తన తల్లి హేమలత, అక్కతో కలిసి నివసిస్తున్నాడు.

*15-10-2026, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో* దుర్గ ప్రసాద్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లి మరియు అక్కతో కుటుంబ విషయాలపై గొడవపడ్డాడు. గొడవ అనంతరం కోపంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని పడుకున్నాడు.
రాత్రంతా అతను బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతను నిద్రపోతున్నాడని భావించారు. ఈ రోజు ఉదయం అనగా 16-10-2026, గురువారం ఉదయం 6 గంటలకు తల్లి హేమలత లేచి చూసేసరికి బెడ్ రూమ్ లో అతను ఉరి వేసుకుని విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు.
*ఆత్మహత్యకు కారణం ఏంటి?*
కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం దుర్గ ప్రసాద్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. దీంతో మద్యం తాగే అలవాటుకు బానిస అయ్యాడు. మద్యం మత్తులో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా అదే విధంగా గొడవ జరిగి, మనస్తాపం భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే శంకరంపేట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు.
*మృతుని తల్లి హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.*

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనతో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్యం వ్యసనం, కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.