వైష్ణవి నగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. మహిళల కోలాహలం!
పోచారం అక్టోబర్ 10 (ప్రజావాణి):తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వైష్ణవి నగర్ ఓనర్స్ కాలనీలో మొదటి రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వైష్ణవి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడి సందడి చేశారు. మహిళల ఉత్సాహం, పూల బతుకమ్మల...