prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:48 pm Digital Edition : PRAJA VANI

వెళ్తూ వెళ్తూ మా అందరినీ చల్లగా చూడమ్మా

వెళ్తూ వెళ్తూ మా అందరినీ చల్లగా చూడమ్మా!

దుర్గాభవాని అమ్మవారిని వేడుకున్న సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్

నారాయణఖేడ్ అక్టోబర్ 21 ప్రజావాణి

కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో దుర్గాభవాని అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ గ్రామ ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలని సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “అమ్మా దుర్గాభవాని తల్లీ.. వెళ్తూ వెళ్తూ మా గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడమ్మా. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. ప్రజల కష్టాలను తొలగించి, వారి కోరికలను తీర్చాలి. మా గ్రామంపై నీ చల్లని చూపు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించేలా దీవించమ్మా. వచ్చే ఏడాది మళ్లీ మరింత వైభవంగా నీ ఉత్సవాలు జరుపుకునేలా మా గ్రామానికి రావాలి” అని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో భవాని మాత భక్తులు గ్రామ పెద్దలు యువకులు స్వాములు, వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.