prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 8:52 pm Digital Edition : PRAJA VANI

వెబ్‌సైట్ ద్వారా ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు: పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

వెబ్‌సైట్ ద్వారా ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు: పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి పల్నాడు జిల్లా అక్టోబర్ 25

*పల్నాడు జిల్లా:* స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా సులభంగాతెలుసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు.
ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో ఆన్‌లైన్‌లో ముందుగానే పరిశీలించుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.

వెబ్‌సైట్ ద్వారా లభించే సమాచారంఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని ఆన్‌లైన్‌లో వెతికి తెలుసుకోవచ్చు.

ఎన్నికలసన్నాహాలు ఓటరు వివరాలను ముందస్తుగా సరి చూసుకోవడం ద్వారా ఎన్నికల రోజు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవచ్చు.

ప్రత్యేకసదుపాయం పోలింగ్ స్టేషన్‌ను తెలుసుకోవడానికి వీలుగా చిత్రంలో ఇవ్వబడిన *QR కోడ్* ను స్కాన్ చేసి కూడా వివరాలు పొందవచ్చు.