వెంకటాపురంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం
ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ వెంకటాపురంలో మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ జరిగిన ఈ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ మహా చండీ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తిభావం పెంపొందడంతో పాటు ప్రజల్లో ఐక్యత, సోదరభావం బలపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...