prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:24 pm Digital Edition : PRAJA VANI

వృద్దుల ఇంట్లో బంగారం వెండి చోరీ..

వృద్దుల ఇంట్లో బంగారం వెండి చోరీ..
పట్టుకున్న పోలీసులు..సొమ్ము రికవరీ
ఎస్సై కరుణాకర్
ప్రజావాణి,నెల్లికుదురు: వృద్ధ దంపతుల ఇంట్లో ఇండియా ఆభరణాలు చోరీకి గురికాగా పోలీసులు నిందితుని వెతికి పట్టుకొని రికవరీ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం నెల్లికుదురు మండలం దుర్గాభవాని గ్రామపంచాయతీ పరిధి రామోజీ తండాకు చెందిన జాటోత్ బుల్లి జాటోతు పులాని దంపతులు ఇద్దరే తమ ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఉండబడిన ఒక తులం బంగారు ఆకుల గొలుసు, ఒక జత వెండి కాళ్ల పట్టీలు(25 తులాలు)తమ ఇంట్లోని సంతకలో భద్రపరచుకోగా అదే తండాకు చెందిన గుగులోతు సూర్య(సురేష్) గమనించాడు.పని మీద వృద్ధ దంపతులు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లారు. వచ్చి చూసేసరికి ఇంటి తాళం తీసి ఉంది. సందుకలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనబడలేదు.ఈ మేరకు జాటోత్ బుల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్సై కరుణాకర్ పోలీసులతో కలిసి అపహరించిన వారికోసం వెతుకుతున్న క్రమంలో గుగులోతు సూర్య సోమవారం దుర్గాభవాని తండా క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల కంట పడగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు తో పాటు 25 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని తొర్రూరు న్యాయస్థానంలో నిందితున్ని సోమవారం హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.