వీడీసీకి అధికారం ఇచ్చింది ఎవరు? ఇటిక్యాల వాగులో రూ.15 లక్షల ఇసుక దందా
*వీడీసీకి అధికారం ఇచ్చింది ఎవరు? ఇటిక్యాల వాగులో రూ.15 లక్షల ఇసుక దందా!* *రాయికల్, అక్టోబర్ 14 (ప్రజావాణి):* రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారు వాగులో ఇసుక తవ్వకాలకు గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో అనధికారికంగా నిర్వహించిన బహిరంగ వేలం పాట ఏకంగా రూ.15 లక్షలకు పలికినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామంలోనే రహస్యంగా నిర్వహించిన ఈ వేలం పాటలో పాల్గొనడానికి ముందే ఒక్కొక్కరి నుంచి రూ.20,000 చొప్పున డిపాజిట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. పలువురు గుత్తేదారులు పోటీపడగా, చివరకు ఒక గుత్తేదారుడు రూ.15...