వినోద్ కుమార్ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు…చౌదరిగూడ పది కాలనీల్లో దోమల మందు పిచికారీ
ఘట్కేసర్, అక్టోబర్ 3 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడలో పది కాలనీల్లో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ప్రతి కాలనీలో దోమల నియంత్రణ చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను...