విధి నిర్వహణలో అర్షణీయ సేవలు.. ప్రజా రక్షణలో ‘నెంబర్ వన్’ ఎస్సై కొప్పుల తిరుపతి!
ఆపదలో ఉన్నారంటే నిమిషాల్లో ప్రత్యక్షం.. ఏజెన్సీలో రక్షణగా నిలుస్తున్న సబ్ ఇన్స్పెక్టర్!
మీడియా, వార్తా ఛానళ్లలో వెలుగు చూసే ప్రజా సమస్యలపై సత్వర స్పందన!
ప్రజలు, విలేకరుల నుండి వెల్లువెత్తుతున్న అభినందనలు!
వెంకటాపురం (నూగురు), అక్టోబర్ 12 (ప్రజావాణి): శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజలకు అండగా నిలవడంలో వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) కొప్పుల తిరుపతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏ రకమైన సమస్య లేదా అత్యవసర పరిస్థితి ఎదురైనా, ఏ ఛానల్ లేదా పత్రికా మాధ్యమం ద్వారా విషయం వెలుగులోకి వచ్చినా తక్షణమే స్పందిస్తూ ‘రియల్ హీరో’గా తన విధులను నిర్వర్తిస్తున్నారు.
బాధితులకు తక్షణ న్యాయం – అక్రమార్కులకు హెచ్చరిక:
ఏజెన్సీ గ్రామాల పరిధిలో జరిగే అక్రమ దందాలు, రహదారి భద్రతా లోపాలు లేదా ప్రజలకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలపైనైనా కొప్పుల తిరుపతి క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నారు. సమస్య ఉన్న చోటికి చేరుకుని బాధితులకు ధైర్యం చెబుతూ, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల్లో కొండంత నమ్మకాన్ని నింపుతున్నారు.
జర్నలిస్టులకు, పత్రికా రంగానికి నిరంతర సహకారం:
ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే పత్రికలు, న్యూస్ ఛానళ్ల వార్తా కథనాలకు సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే సంబంధిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించడంలో ఆయన ప్రదర్శిస్తున్న చొరవ అభినందనీయం. ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యమిస్తూ, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్న ఎస్సై కొప్పుల తిరుపతి సేవలను మండల ప్రజలు, ప్రజావాణి విలేకరులు కొనియాడుతున్నారు.