పోచారం, అక్టోబర్ 12 (ప్రజావాణి):*11 కేవీ జోడిమెట్ల ఫీడర్ విభజన పనుల కారణంగా అక్టోబర్ 13న (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నారపల్లి ఏఈ విక్రమ్ బుక్యా తెలిపారు. విద్యుత్ అంతరాయ ప్రాంతాలు స్వర్ణగిరి కాలనీ, పీజీఎస్ కాలనీ, అరుంధతి కాలనీ, సీఎస్‌వీఆర్ కళాశాల, హిమగిరి కాలనీ, జోడిమెట్ల ఎక్స్‌రోడ్స్, 2బీహెచ్‌కే, కోర్రెముల, పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.