prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:38 pm Digital Edition : PRAJA VANI

విద్యుత్ సబ్ స్టేషన్లలో ఘనంగా ఆయుధ పూజ

విద్యుత్ సబ్ స్టేషన్లలో ఘనంగా ఆయుధ పూజ: ప్రత్యేక పూజలు నిర్వహించిన సిబ్బంది

పరిగి,అక్టోబర్ 16 ( ప్రజావాణి )

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో శుక్రవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ నియంత్రణ యంత్రాలు, ఇతర పరికరాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలకు నిరంతరం ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందాలని, సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అంతా క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
అదేవిధంగా మండల పరిధిలోని పుట్టాపహడ్, బండవెల్కిచర్ల, ముజాహిద్‌పూర్ విద్యుత్ సబ్ స్టేషన్లలోనూ సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్లకు, యంత్రాలకు ప్రత్యేకంగా ఆయుధ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.