విద్యా కమిటీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం!”వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నచోట కుట్రపూరితంగా ఎన్నికల వాయిదా! * అధికారులు, పోలీసులతో బలవంతపు రాజీలు.. బద్వేలు నియోజకవర్గంలో అక్రమాలు శృతిమించాయి. * మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం.
పోరుమామిళ్ల, అక్టోబర్ 03 ప్రజావాణి "ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక. పోలీసు బలగాలతో, అధికారుల అండతో విద్యా కమిటీ ఎన్నికలను ఏకపక్షంగా మార్చడం సిగ్గుచేటు.ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని తెలిసి,ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ ఈ దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపింది పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు. రాష్ట్రంలో జరుగుతున్న పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,గ్రామాల్లో...