prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 7:14 pm Digital Edition : PRAJA VANI

విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా:-*

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్‌లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, హాజీపూర్ మండలం కర్ణమామిడిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాబోధన, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతులలో వెనుకబడిన విద్యార్థినులను గుర్తించి, వారి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం సకాలంలో అందించాలని, పాఠశాలలలో పరిశుభ్రతను పాటించాలని, విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారుఅనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ, రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.