విజయవాడలో అక్టోబర్ 5న సీఆర్ఎం టీచర్స్ భారీ ఆందోళన: నెల్లూరు జిల్లా అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపు
నెల్లూరు,అక్టోబర్ 3 ప్రజావాణి సమగ్ర శిక్ష-పాఠశాల విద్యాశాఖలో గత 15 ఏళ్లుగా ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన విధులను నిర్వర్తిస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరుబాట పట్టారు. ఏపీ సీఆర్ఎం టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ (సోమవారం) విజయవాడలోని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన భారీ ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ సీఆర్ఎం డబ్ల్యూఏ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు తుమ్మల...