విజయదశమి వేడుకల్లో పాల్గొన్న గుఱ్ఱపు మచ్చేందర్
*విజయదశమి వేడుకల్లో పాల్గొన్న గుఱ్ఱపు మచ్చేందర్* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్-బలయ్ వేడుకల్లో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అలయ్-బలయ్ వేడుకలు ప్రజల మధ్య ఆప్యాయత, సోదరభావం, ఐకమత్యాన్ని చాటిచెప్పాయి. వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో...