prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 3:30 pm Digital Edition : PRAJA VANI

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

సాగర్ ఫ్యాక్టరీలో ప్రజా భరోసా, డ్రగ్స్ అవగాహన, అరైవ్ అలైవ్ కార్యక్రమాలు.

హుజూర్నగర్ అక్టోబర్ 29 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి సాగర్ ఫ్యాక్టరీలో డ్రైవర్లకు ప్రజా భరోసా, మాదకద్రవ్యాల నివారణ, అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదకరమని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.

అనంతరం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.