వాసరే కవిత రాజు కుమార్తె ప్రీతి, కుమారుడు సుశాంత్ యొక్క నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 25
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాస్రే రమేష్ వారి అన్నయ్య పిల్లల నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ శుభకార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారితో ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఎంతో ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగింది.
చిన్నారులకు నూతన వస్త్రాలంకరణ మహోత్సవ శుభాకాంక్షలు. వారి జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, విజయాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మండల అధ్యక్షులు బోల్లి గంగాధర్,ఉపసర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్, వార్డ్ నెంబర్స్ గాయక్వాడ్ విట్టల్, పుల్ల గంగాధర్, హైదర్, మోహన్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు…