prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 8:22 pm Digital Edition : MAHESH MEDCHAL

వార్త రాశాడని విలేకరిపై బ్లాస్టింగ్ మాఫియా బూతు పురాణం* – *ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తీవ్ర బెదిరింపులు*

*వార్త రాశాడని విలేకరిపై బ్లాస్టింగ్ మాఫియా బూతు పురాణం*

*​ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తీవ్ర బెదిరింపులు*

*​ఆధారాలుంటే లీగల్‌గా తేల్చుకోవాలన్న విలేకరి*

*​పోలీస్ అధికారుల పేర్లతో హల్‌చల్.. స్టేషన్‌కు రావాలని సవాల్*

*మేడ్చల్ ప్రజావాణి:-
మేడ్చల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల కంట్రీ క్లబ్ సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్ విషయంలో శుక్రవారం ఒక పత్రికలో వచ్చిన వార్తా కథనం స్థానిక బ్లాస్టింగ్ నిర్వాహకులు, వార్త రాసిన విలేకరి మధ్య తీవ్ర దుమారానికి దారితీసింది. తాము చేస్తున్న వ్యాపారం లేదా పనులపై వ్యతిరేకంగా పత్రికలో వార్త రాశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన ఆడియో సంభాషణ కలకలం రేపుతోంది.

*పైసలు తీసుకున్నారంటూ ఆరోపణలు*

ఫోన్ చేసిన వ్యక్తులు (కుమార్ తదితరులు) విలేకరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “మా బండ్ల ఫోటోలు ఎందుకు తీశావు ? మేము డబ్బులు ఇస్తే తీసుకుని, మళ్లీ మాపైనే వార్తలు రాస్తావా? నీకు విశ్వాసం లేదా?” అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. తమ వద్ద అన్ని రికార్డులు, ఫోటోలు ఉన్నాయని ఆరోపించారు.

*ఆధారం ఉంటే లీగల్‌గా వెళ్లండన్న విలేకరి*

ఈ ఆరోపణలపై విలేకరి స్పందిస్తూ.. “నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. మీ వద్ద ఆధారాలు ఉంటే చట్టబద్ధంగా (లీగల్‌గా) తేల్చుకోండి. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి” అని పేర్కొన్నారు. తాను తప్పు చేయలేదని, దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

*పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ సవాల్.. అధికారుల పేర్లతో హల్‌చల్*

తాము నిబంధనల ప్రకారమే బ్లాస్టింగ్‌ పనులు చేస్తున్నామని, లైసెన్స్‌లు అన్నీ ఉన్నాయని సదరు వ్యక్తులు వాదించారు. తమకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని చెబుతూ.. స్థానిక సీఐ, ఏసీపీల పేర్లను ప్రస్తావించారు. “రేపు ఉదయం 10:30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రా.. సీఐ సమక్షంలోనే తేల్చుకుందాం” అంటూ విలేకరిని స్టేషన్‌కు రావాలని సవాల్ విసిరారు. ఇందుకు విలేకరి కూడా “నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను స్టేషన్‌కు వచ్చి వివరణ ఇస్తా” అని బదులిచ్చారు.