వారం రోజుల్లో ఘట్కేసర్ రైల్వే వంతెన రోడ్డు సమస్య పరిష్కారం… జేఏసీకి హామీ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్
ఘట్కేసర్, అక్టోబర్ 27 (ప్రజావాణి): ఘట్కేసర్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే వంతెన పనులకు సంబంధించి ఇరువైపులా రోడ్ల దుస్థితిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ హామీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మాధవరెడ్డి ఫ్లైఓవర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న బాధితుల్లో అర్హులైన వారికి టీడీఆర్ (TDR)లు చెల్లిస్తామని తెలిపారు రైల్వే వంతెనకు ఇరువైపులా రోడ్లు అధ్వానంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఘట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ...