prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 5:44 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

వారం రోజుల్లో ఘట్కేసర్ రైల్వే వంతెన రోడ్డు సమస్య పరిష్కారం… జేఏసీకి హామీ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్

 

ఘట్కేసర్, అక్టోబర్ 27 (ప్రజావాణి): ఘట్కేసర్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే వంతెన పనులకు సంబంధించి ఇరువైపులా రోడ్ల దుస్థితిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ హామీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మాధవరెడ్డి ఫ్లైఓవర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న బాధితుల్లో అర్హులైన వారికి టీడీఆర్‌ (TDR)లు చెల్లిస్తామని తెలిపారు

 

రైల్వే వంతెనకు ఇరువైపులా రోడ్లు అధ్వానంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఘట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, సభ్యులు సోమవారం ప్రజావాణిలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణిని కలిసి వివరించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ఘటనా స్థలాన్ని సందర్శించి, జేఏసీ సభ్యులతో కలిసి రోడ్డు పరిస్థితులను పరిశీలించారు. సమస్య తీవ్రతను గుర్తించి వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమస్య పరిష్కారానికి చొరవ చూపిన డిప్యూటీ కమిషనర్ వాణికి జేఏసీ తరఫున మారం లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, అల్లు కమలాకర్, బచ్చు ప్రమోద్ గుప్తా, ఎండీ సిరాజ్, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.