prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:15 pm Digital Edition : PRAJA VANI

వాకర్స్‌తో మమేకం. నగరాభివృద్ధికి భరోసా

వాకర్స్‌తో మమేకం. నగరాభివృద్ధికి భరోసా

పీటిసిలో మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌

అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి

అనంత పురం బ్యూరో అక్టోబర్ 21 ప్రజా వాణి
అనంతపురం నగర ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌. బుధవారం ఉదయం పిటిసిలో మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసిన ఆయన.. వారితో ఆప్యాయంగా మాట్లాడి ఓట్లు అభ్యర్థించారు. కేవలం పరిచయాలకే పరిమితం కాకుండా నగరాభివృద్ధిపై తన ఆలోచనలను వారితో పంచుకున్నారు.ఉదయపు నడకకు వచ్చిన వారిని ఒక్కొక్కరినీ పలకరిస్తూ, నగరంలో నెలకొన్న సమస్యలపై తనకున్న అవగాహనను వివరించే ప్రయత్నం చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, వాటి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆప్యాయ పలకరింపు.. అభివృద్ధిపై చర్చ!
రాజకీయాలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కొనసాగించే వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకుంటూ రమేష్‌ గౌడ్‌ వాకర్స్‌తో మమేకమయ్యారు. నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు , వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్‌ ఆయనతో ఆప్యాయంగా సంభాషించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యాపారులు సహా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతో రమేష్‌ గౌడ్‌ మమేకమవుతూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నగరాభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలే తన ప్రాధాన్యాలని వివరించారు.
ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, నగరాభివృద్ధిపై తన ప్రణాళికలను వివరించడం లక్ష్యంగా రమేష్‌ గౌడ్‌ చేపట్టిన ఈ మార్నింగ్‌ వాకర్స్‌ సంప్రదింపు కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది.