వలస కార్మికుల పిల్లలకు ‘ప్రేరణ’ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
ఉప్పల్, అక్టోబర్ 4 (ప్రజావాణి): గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉప్పల్ సాయిబాబా కాలనీలో వలస కార్మికుల పిల్లలకు ‘ప్రేరణ’ బాలల వేదిక ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ప్రేరణ బాలల వేదిక అధ్యక్షుడు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో కబడ్డీ, పరుగు పందెం, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్, పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ ఉప్పల్ ప్రాంతంలో బడికి వెళ్లని పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బడి మానేసిన పిల్లలను తిరిగి విద్య వైపు మళ్లించడమే...