*వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగుచేయాలి*
చిలిపిచెడ్. అక్టోబర్ 12
ప్రజావాణి.నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
రైతు వేదిక చిలిపిచేడు నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు నష్టాలు రాకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు, నీటి వనరుల లభ్యత ఆధారంగా పంటల ఎంపికపై రైతులకు సూచనలు అందించాలని తెలిపారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు .రైతులకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక పంటలను సూక్ష్మ జలాలు లభ్యతకు అనుగుణంగా పంటలను ప్రోత్సహించాలని సూచించారు .
ప్రతి రైతు తన ప్రాంతాల్లోని భూగర్భ జలాల పరిమితిని తెలుసుకున్న తర్వాతే పంటను ఎంపిక చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నిత్యానంద్ , MRO శ్రీనివాసు ,MAO రాజశేఖర్ గౌడ్ MPO మొనిరుద్దీన్ AEO లు మరియు రైతులు పాల్గొన్నారు