వంకమర్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో, కారు ముఖాముఖి ఢీ.. 13 మందికి తీవ్ర గాయాలు, నలుగురి పరిస్థితి విషమం!
కడప జిల్లా కాసినాయన అక్టోబర్ 1 ప్రజావాణి మండలం వంకమర్రి గ్రామ సమీపంలో గురువారం ఒక్క ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.గురువారం మైదుకూరు వైపు నుంచి ప్రయాణికులతో కూడిన...