prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 8:04 pm Digital Edition : PRAJA VANI

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా

ప్రజావాణి అక్టోబర్ 23 కమలాపూర్ మండల్ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలంలో పర్యటించారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి నేరుగా అందజేశారు

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఇల్లు వద్దకే వెళ్లి చెక్కులు అందజేసేలా కార్యక్రమాన్ని చేపట్టారు

వైద్య చికిత్సల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయని ద్వారా అందుతున్న సాయం కొంతమేరకు ఆర్థిక భారాన్ని తగ్గించనుంది ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు

పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఆపదలో ఆర్థిక భరోసా

వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఊరటం ఇస్తుందని లబ్ధిదారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు