prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 1:15 pm Digital Edition : PRAJA VANI

లచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వసంత

లచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వసంత

• మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ₹5,000 ఆర్థిక సహాయం అందజేత

మన ప్రజావాణి | మక్తగూడెం | అక్టోబర్ 28: జిల్లా ప్రతినిధి

మక్తగూడెం గ్రామానికి చెందిన లచ్చమ్మ మరణించడంతో, సర్పంచ్ తల్లి వసంత మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆర్థిక సహాయంగా ₹5,000 అందజేశారు.
లచ్చమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వసంత బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యులు విష్ణు, ఒగ్గు దేవయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ తమ సానుభూతిని తెలియజేశారు.