prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 8:10 am Digital Edition : PRAJA VANI

లక్ష్మీపల్లి ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన కొల్లాపూర్ డీఎం

లక్ష్మీపల్లి ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన కొల్లాపూర్ డీఎం

ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలన

చిన్నంబావి, ప్రజావాణి అక్టోబరు 6:

చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మీపల్లి స్టేజీ వద్ద అక్టోబరు 4న జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని సోమవారం కొల్లాపూర్‌ డీఎం నీలమణి, ఎస్‌బీఐ రత్నమ్మ పరిశీలించారు. వారి వెంట లక్ష్మీపల్లి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు.ఈ సందర్భంగా డీఎం నీలమణి మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన బస్సుకు ఇన్సూరెన్స్‌ ఉన్నందున బాధిత కుటుంబ సభ్యులు కోర్టు ద్వారా పరిహారం పొందేందుకు కేసు దాఖలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్‌ పరిహారం అందేలా తమ వంతు కృషి చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సంపంగి మద్దిలేటి, గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.