లక్ష్మీనగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఘట్కేసర్, అక్టోబర్ 18(ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలో లక్ష్మీనగర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నార తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషంగా ఉందని కాలనీ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షుడు చల్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూరపాటి...