లక్ష్మిపూర్‌లో విద్యుత్ సరఫరా లోపంతో ఎండుతున్న పంటలు
బెజ్జంకి, అక్టోబర్ 7 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన రైతు దుగ్యని నాగరాజుకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో వరి పంట పొట్ట దశకు చేరుకుంది. అయితే విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్ యువ నాయకులు ముక్కిస అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను మెరుగుపరచి, పంటలను కాపాడుకునేలా రైతులకు నిరంతర విద్యుత్ అందించాలనీ తెలిపారు.