prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:23 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ చింతకింది అశోక్ మృతి..అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ చింతకింది అశోక్ మృతి..అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

చెన్నారావుపేట అక్టోబర్ 30 ప్రజావాణి

మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ చైర్మన్ చింతకింది వంశీ తండ్రి అయిన చింతకింది అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కల్గించింది.విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ఉప్పరపల్లి గ్రామానికి చేరుకున్నారు. అశోక్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న స్వప్న సుదర్శన్ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.చింతకింది అశోక్ అంతిమయాత్రలో  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్, నెక్కొండ మండల పార్టీ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి, కొండవీటి ప్రదీప్ కుమార్,మాజీ కోఆప్షన్ మెంబర్ రఫీ, మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్, మాజీ సర్పంచులు పెరుమాళ్ళ శ్రీధర్ రెడ్డి, కుండే మల్లయ్య, మాజీ డైరెక్టర్ జున్నుతుల శ్రీధర్ రెడ్డి, ఎంపిటిసి చెరుకుపల్లి విజేందర్ రెడ్డి, నాయకులు ఎడారి సాయిలు, గుండాల మహేందర్, పసునూటి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు అందే వెంకట రాములు, కందగట్ల సాంబయ్య, ఉప సర్పంచ్ మంతుర్తి అన్వేష్, సీనియర్ నాయకులు ఉడుగుల సాంబయ్య, మండల నాయకులు ములుక సాంబయ్య కవి, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్, మూడు రమేష్, పవన్, అలాగే ఉప్పరపల్లి స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అశోక్‌కు కన్నీటి నివాళులు అర్పించారు.