రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన సర్పంచ్.
నాగర్ కర్నూలు జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం:
అక్టోబర్ 23/ప్రజావాణి ప్రతినిధి.
వెల్దండ మండల కేంద్రానికి చెందిన శానమోని శ్రీను
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శుక్రవారం పరామర్శించారు.విషయం తెలుసుకున్న సర్పంచ్ యెన్నమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గాయపడిన శ్రీను కి మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్స్ ని కోరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శలో సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచి ఎర్ర శ్రీను, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.