prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:21 pm Digital Edition : PRAJA VANI

రోడ్డు ప్రమాదంలో కూటిగల్ మత్స్యశాఖ గ్రామ అధ్యక్షుడు కృష్ణమూర్తి మృతి

రోడ్డు ప్రమాదంలో కూటిగల్ మత్స్యశాఖ గ్రామ అధ్యక్షుడు కృష్ణమూర్తి మృతి

మద్దూరు అక్టోబర్ 14, ప్రజా వాణి,

మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన మత్స్యశాఖ అధ్యక్షుడు అరే కృష్ణమూర్తి(55) జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళి జీవనం సాగిస్తున్న క్రమంలో బుదవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్థులు విలేఖర్లకు తెలిపారు. మృతునికి భార్య ఒక కూతురు,కుమారుడు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో పోస్టు మార్టం అనంతరం కూటిగల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉన్న కృష్ణమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబానికి గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ, ఉపసర్పంచ్, పాలక వర్గం సభ్యులు తమ సంతాపం తెలిపారు.