*రోడ్డు నిర్మాణ కార్మికుడి మృతి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్గొండ మండలంలోని ముషంపళ్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాస్తూ చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నల్గొండ రూరల్ ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రనికి చెందిన బోలా కుమార్ మహాతో ( 21) రోడ్డు నిర్మాణ కార్మికుడిగా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా కాంక్రీట్ మిల్లర్ వెనక్కి వచ్చి పనులు చేస్తున్న కుమార్ పై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతి సోదరుడు రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.