prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 7:15 pm Digital Edition : PRAJA VANI

రైతు నేస్తం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

రైతు నేస్తం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి
రేపు రైతు వేదికల్లో సీఎం ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం
కూసుమంచి, అక్టోబర్ 11 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం సోమవారం (అక్టోబర్ 12) నిర్వహించనున్నట్లు కూసుమంచి మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కూసుమంచి, నాయకన్‌గూడెం రైతు వేదికల్లో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, అనువైన పంటల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకొని, సాగులో తగిన జాగ్రత్తలు తీసుకునేలా రైతులకు సూచనలు అందించనున్నారు.
కావున కూసుమంచి మండలంలోని ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతులు ఆయా రైతు వేదికల్లో జరిగే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.