prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:16 am Digital Edition : PRAJA VANI

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి.

అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 10

కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌ అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కరోళ్ల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించడంలో సొసైటీ కీలక పాత్ర పోషించాలని అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
సన్మానానికి స్పందించిన బొంబోతుల లింగాగౌడ్ మాట్లాడుతూ రైతులు, సొసైటీ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రైతుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సొసైటీ అభివృద్ధితో పాటు రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు బొంబోతుల నరేష్ గౌడ్,బొంబోతుల సురేష్ గౌడ్, ఇందూరి సిద్ధాగౌడ్, మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్, మొగుళ్ళ రామాగౌడ్,తాటిపాముల ప్రశాంత్ గౌడ్, జంగంపల్లి బాలకిషన్ గౌడ్, దేవేందర్ గౌడ్, స్వామి గౌడ్, అధికం నర్సగౌడ్, రేవన్ గౌడ్ పాటు పలువురు గౌడ ప్రముఖులు, రైతు ప్రతినిధులు, సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు