prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:29 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

రైతుల అభివృద్ధి,సంక్షేమం,ఆర్థిక భద్రతే కొత్తపల్లి పిఎసిఎస్ ప్రధాన లక్ష్యం.

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం.

చైర్మన్‌ డా.సునీల్‌ కుమార్‌.

వరి ధాన్యానికి రూ.4,500–5,000 మద్దతు ధర ప్రకటించాలి.

రైతులకు కనీస ధరపై ప్రభుత్వ భరోసా అవసరం.

ధాన్యం కొనుగోలులో రైతులకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యం.

మద్దతు ధరపై పీఏసీఎస్‌ జనరల్‌ బాడీలో తీర్మానం.

అన్ని పీఏసీఎస్‌ చైర్మన్లు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలి.

రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం.

కొత్తపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం.

కోటగిరి/ప్రజావాణి:-రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని పీఏసీఎస్‌ కొత్తపల్లి చైర్మెన్ డాక్టర్‌ వెనిగళ్ల సునీల్‌కుమార్‌ చౌదరి అన్నారు.సోమవారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 2026 వర్షా కాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ ఆవరణం లో చైర్మన్‌ డాక్టర్‌ వెనిగళ్ల సునీల్‌కుమార్‌ చౌదరి చేతుల మీదుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా కోటగిరి మండల తహసీల్దార్‌ కే.గంగాధర్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్‌ డాక్టర్‌ వెనిగళ్ల సునీల్‌కుమార్‌ చౌదరి మాట్లాడుతూ.ప్రస్తుతం మార్కెట్‌లో వరి ధాన్యానికి లభిస్తున్న ధరలను దృష్టిలో ఉంచుకుని దొడ్డు వడ్ల నుంచి సన్న వడ్ల వరకు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.4,500 నుంచి రూ.5,000 వరకు అధికారిక మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఈ అంశంపై పీఏసీఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంతో పాటు ఇతర సమావేశాల్లో తీర్మానం చేసి రైతుల తరఫున ప్రభు త్వానికి ప్రతిపాదన పంపించనున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు కూడా ఇదే అంశంపై తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తానన్నారు.ప్రభుత్వం రూ.4,500–5,000 వరకు అధికారిక మద్దతు ధర ప్రకటిస్తే రైతులకు ప్రభుత్వ కొనుగోలు ద్వారా కనీస ధరపై భరోసా ఏర్పడుతుందని,ప్రైవేటు వ్యాపారులు కూడా అంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొ న్నారు.ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాల్‌ ధాన్యానికి సుమారు రూ.4,000 వరకు ధర లభిస్తున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నప్ప టికీ, ప్రభుత్వ మద్దతు ధర రైతులకు కనీస ధరపై భరోసా కల్పిస్తుందని అన్నారు.రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని.వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. రైతుకు సరైన ధర లభించడమే రైతు కుటుంబానికి నిజమైన భరోసా అని అన్నారు.రైతులు ధాన్యం నాణ్యత,తేమ శాతం,మార్కెట్‌లో లభిస్తున్న ధరలను పరిశీలించి అందుబాటులో ఉన్న మెరు గైన ధరకు తమ పంటను విక్రయించుకోవాలని సూచించా రు.రైతుల అభివృద్ధి,సంక్షేమం,ఆర్థిక భద్రతే కొత్తపల్లి పీఏసీ ఎస్‌ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఏర్పడే పాలకవర్గాలు కూడా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను కొనసాగించాలని,ప్రభుత్వంపై సానుకూల ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు మెరుగైన మద్దతు ధర సాధించేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పి.గంగారం,కోర్ర రవి,వెల్లంకి సీతాకుమారి రంగదాస్‌ చౌదరి,విస్లావత్‌ షాంకీబాయి శంకర్‌,డైరెక్టర్లు వల్లే పల్లి శ్రీనివాసరావు,గుగులోతు తుకారాం,మండల వ్యవసాయ అధికారి రాజు,ఏఈఓలు రాంపూర్‌ షేక్‌ గౌస్‌,కొత్తపల్లి ప్రశాంత్‌,సొసైటీ సీఈఓ కమలేష్‌,సుదర్శన్‌,రైతులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.