రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఎక్కడిది

*రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఎక్కడిది* *మాటల్లో 24 గంటలు.. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ కోతలా?* *వ్యవసాయ విద్యుత్‌పై నిర్లక్ష్యం వీడి రైతులకు న్యాయం చేయాలి: బొల్లం మల్లయ్య యాదవ్‌* *చిలుకూరు అక్టోబర్ 08(ప్రజావాణి)*: వ్యవసాయ విద్యుత్‌ సరఫరాపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ గురువారం చిలుకూరు మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌లు, విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, మండలంలోని వివిధ గ్రామాలకు వ్యవసాయానికి...