prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:25 pm Digital Edition : PRAJA VANI

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజావాణి, అక్టోబర్ 13,

సదుం: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు తహశీల్దారు కార్యాలయంలో డీటీ ముద్దుకృష్ణమనాయక్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని బియ్యం బస్తాలపై క్యూర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని వారు కోరారు. ఆధునాతన స్కానింగ్ పరికరాలు పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల అసంబద్ధ మ్యాపింగ్ విధానాన్ని మార్చి, ఆ ఏరియాలలో ఉన్న రేషన్ షాపులకు సమానంగా కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు, రోగులకు ఇంటి వద్దకే స్వంత ఖర్చులతో సరుకులు పంపిణీ చేస్తున్నామని, అందుకోసం డీలర్లకు సేవా రుసుం చెల్లించాలన్నారు. వ్యయాలు భారీగా పెరగడంతో డీలర్ల కమీషన్ పెంచాలన్నారు. ఖాళీ గోనెసంచులను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈకేవైసీని డీలర్లు కాకుండా గ్రామ సచివాలయాలలో చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమచంద్రారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.