రేషన్ డీలర్ల గర్జన 11 డిమాండ్లతో కడపలో భారీ ఆందోళన.రూ.5 వేల వేతనం,కమిషన్ పెంపు కోరుతూ ASOకు వినతిపత్రం !

కడప,అక్టోబర్ 16: ప్రజావాణి రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను నడుపుతూ, పేద ప్రజలకు సరుకులు అందిస్తున్న రేషన్ డీలర్ల సమస్యలపై నేషనల్ ప్రొడక్షన్ కం డిస్ట్రిబ్యూషన్ స్కీం డీలర్స్ ఫెడరేషన్ సమరశంఖం పూరించింది. డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కడప నగరంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు 11 ప్రధాన డిమాండ్లతో కూడిన సమగ్ర వినతి పత్రాన్ని ఏఎస్ఓ (అసిస్టెంట్ సప్లై ఆఫీసర్) కు అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను...